
మనం అనుకున్నామని అన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోవు డార్లింగ్. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కొన్నిసార్లు ఆలస్యాలు కూడా తప్పవు అని రెబల్ సైన్యానికి చూచాయగా హింట్ ఇస్తున్నారు ప్రభాస్. ఇంతకీ, ఇప్పటికిప్పుడు ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని అంటారా? అది సీక్రెట్… ప్రభాస్ హెల్త్ సీక్రెట్. అప్పుడెప్పుడో బాహుబలి రిలీజ్ టైమ్ నుంచీ ప్రభాస్ మోకాలి నొప్పితో ఇబ్బందిపడుతూనే ఉన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత ఫిజియోథెరపీతో సెట్ చేద్దామని అనుకున్నారు. అయినా హెక్టిక్ షెడ్యూళ్లు, నాన్‌స్టాప్‌గా ప్రమోషనల్ ఈవెంట్స్ తో అప్పుడు సాధ్యం కాలేదు.
కాలునొప్పితోనే సాహో మూవీని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రాధేశ్యామ్ టైమ్‌లో కాస్త బ్రేక్ తీసుకుని సర్జరీ చేయించారు. ఆ తర్వాత అంతా సెట్ అవుతుందని అనుకున్నారు. కాలేదు. పైగా డార్లింగ్‌ని నొప్పి బాగా వేధించింది. ఆ మధ్య అయోధ్యలో ఆదిపురుష్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా స్టేజ్ మీద కృతిసనన్ సాయంతోనే చెప్పులు వేసుకున్నారు ప్రభాస్. అయినా అలాగే సలార్ పూర్తి చేశారు. కల్కి షూటింగ్‌లోనూ పాల్గొన్నారు.
ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్…
ఇప్పుడు నొప్పి తీవ్రత పెరగడంతో మోస్ట్ వాంటెడ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట డార్లింగ్. అయితే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కల్కి, మారుతి సినిమాల షూటింగులు పూర్తయ్యాక ఫారిన్ వెళ్తారా? లేకుంటే ముందుగానే వెళ్తారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్..
ఎలాగోలా కల్కి షూటింగ్ పూర్తి చేసి, నీ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నట్టు కూడా ఓ మాట వినిపిస్తోంది. అదే జరిగితే మారుతి సినిమా, ఆ తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించాల్సిన స్పిరిట్ మరింత ఆలస్యమవుతాయి. మరోవైపు సెప్టెంబర్ 28న విడుదలకు రెడీ అవుతోంది ప్రశాంత్‌నీల్ సలార్. ఈ సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ హాజరవుతారా? లేకుంటే సోలోగా ఇంటర్వ్యూ ఇచ్చి హెల్త్ మీద ఫోకస్ చేస్తారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. అదే జరిగితే ఆదిపురుష్ ఈవెంట్‌నే మళ్లీ గుర్తుచేసుకోవాలి ఫ్యాన్స్.
ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.