Prabhas: పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. వి మిస్ యూ అంటూ..

|

Feb 12, 2022 | 2:42 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ( puneeth raj kumar ) అకాల మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.

Prabhas: పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. వి మిస్ యూ అంటూ..
Prabhas
Follow us on

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ( puneeth raj kumar ) అకాల మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. గతేడాది అక్టోబర్ 29న పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండే స్టార్ హీరో ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో పునీత్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. పునీత్ చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని పునీత్ పుట్టిన రోజున మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు పునీత్ మరణం తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. నిన్న జేమ్స్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. మాఫియా మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా.. కిషోర్ పత్తికొండ నిర్మించారు.

ఇక నిన్న విడుదలైన జేమ్స్ టీజర్ పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. టీజర్ అద్బుతంగా ఉందని.. ఈ సినిమాతో పునీత్ మన ముందుకు రాబోతున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పునీత్ రాజ్ కుమార్‏ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ” జేమ్స్ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ను అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడు ప్రత్యేకమైనదే. వి మిస్ యూ సర్ ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..