
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి (2026 జనవరి 9న ) ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ది రాజా సాబ్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే..
ఇటీవల కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ రన్ టైమ్ దాదాపు 3గంటలపైనే ఉన్నాయి . అదే సమయంలో డైరెక్టర్ తీసిన సినిమాలు మాత్రం తక్కువ నిడివితోనే ఉంటాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా రన్ టైమ్ ఎంతోనని తెలుసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చింది. ‘ది రాజా సాబ్’కు సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో భారీ రన్‌టైమ్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ది రాజా సాబ్ మూవీ రన్‌టైమ్ సుమారు 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ గత సినిమల్లాగే ది రాజా సాబ్ కూడా భారీ రన్ టైమ్ తో ఉందన్నమాట.
It’s only getting bigger and bigger 😎🤙🏻#RebelSaab smashes 30 MILLION+ Views and turns into the MOST ADDICTIVE BANGER Trending at the Top on YouTube 🔥🔥
A @MusicThaman musical vibe 🎧
▶️ https://t.co/NhqOGQhuwv#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/Ga9ovXaFbZ
— People Media Factory (@peoplemediafcy) December 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.