Prabhas: ప్రభాస్‌కు అనారోగ్యం.. సినిమా షూటింగులు క్యాన్సిల్‌.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌

|

Feb 07, 2023 | 3:15 PM

రుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్‌.. అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అన్ని షూటింగులకు ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లినట్లు సినిమా వర్గాల సమాచారం.

Prabhas: ప్రభాస్‌కు అనారోగ్యం.. సినిమా షూటింగులు క్యాన్సిల్‌.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌
Actor Prabhas
Follow us on

రాధేశ్యామ్‌ సినిమా తర్వాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయాడు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో సలార్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సగం పూర్తియనట్లు సమాచారం. అలాగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా చేస్తున్నాడు. కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటు మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌లోనూ నటించనున్నాడీ యంగ్ రెబల్‌ స్టార్‌. ఇది కాకుండా ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో సిద్ధార్థ్ ఆనంద్ ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందనుంది. కాగా ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్‌.. అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అన్ని షూటింగులకు ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లినట్లు సినిమా వర్గాల సమాచారం, కాగా ఈ నెలలోనే మారుతి సినిమా కొత్త షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొనాల్సింది.

అయితే ప్రభాస్ జ్వరం బారిన పడడంతో షెడ్యూల్‌ మొత్తాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్‌ అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతుననారు. అయితే ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ఆరోగ్యం బాగానే ఉందని, ఫ్యాన్స్‌ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతున్నారు. విరామం లేకుండా వరుస సినిమా షూటింగ్సులలో పాల్గొనడం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని, త్వరలోనే సినిమా షూటింగులకు హాజరవుతాడని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..