Radhe Shyam Teaser: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రేమికుల రోజున.. ‘అమర ప్రేమికుల’ అప్‌ డేట్‌..?

ప్రస్తుతం వరుస ప్యాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్‌ కొత్త చిత్రం 'రాధేశ్యామ్' షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Radhe Shyam Teaser: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రేమికుల రోజున.. అమర ప్రేమికుల అప్‌ డేట్‌..?

Updated on: Jan 31, 2021 | 3:50 PM

Radhe Shyam Teaser Releasing On: ‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన కొత్త సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం వరుస ప్యాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్‌ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా మోషన్ పోస్టర్‌లో లైలా మజ్ను, పార్వతీ దేవదాసులను చూపించి చివరిగా ప్రభాస్‌, పూజా హెగ్డేలను చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు, ఆసక్తిని కూడా రేకెత్తించింది. సినిమాలో ఈ జంట కూడా అమర ప్రేమికుల్లా మిగిలిపోతారా..? అనే ప్రశ్నను మిగిల్చిందీ టీజర్‌. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని ఓ చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Rashmika Mandanna: తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చేసుకున్న రష్మిక మందన్న.. ఇంతకీ ఏంటో మీరే చదవండి