Prabhas Nag Ashwin Movie Update: బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా సినిమా వస్తుందంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చూపులు అటు పడుతున్నాయి.
ఇక బాహుబలి రెండు పార్టులకు చాలా సమయం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత చిత్రాలను మాత్రం త్వరత్వరగా పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిలో మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. అందులోనూ ఈ సినిమా కథ టైమ్ మిషన్ నేపథ్యంలో ఉండనుందనే చర్చతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోయినప్పటికీ అడపాదడపా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లను అందిస్తూ… అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ వివరాలను ట్విట్టర్ వేదికలో పంచుకుంది. ఈ సినిమాకు సంగీతం, సినిమాటోగ్రాఫర్‌లను తెర వెనుక హీరోలుగా అభివర్ణిస్తూ.. సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్-లోపెజ్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్‌లను పరిచయం చేశారు. ఇదిలా ఉంటే త్వరలోనే సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టి 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటిస్తుండగా, అమితాబ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.
Proudly presenting our heroes behind the screen.
Welcome @dancinemaniac and @MickeyJMeyer onboard our #PrabhasNagAshwin Project.#Prabhas @nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/cVJKxmwe8p
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 29, 2021
Also Read: Anasuya: మరోసారి స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్న అందాల అనసూయ.. ‘ఈ పాట సినిమాకే హైలైట్’..