
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. ‘ ముందుగా సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని. ఆవిడ ఉంటే ఈవెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ జోష్ ఇస్తుంది’ అని ప్రశంసలు కురిపించారు. అనంతరం సీనియర్ నటి జరీనా వాహబ్ గురించి మాట్లాడుతూ..’ ఈ సినిమాలో ఈమె మా నాన్నమ్మ. తన సీన్స్ చూసి నేను కూడా నా సీన్స్ మర్చిపోయాను. ఈ సినిమా ద్వారా నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయాను. ది రాజా సాబ్ సినిమా నానమ్మ మనవడి కథ’
‘ఈ సినిమాకు ముందు నేను మారుతిని కలిశాను. అన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అభిమానుల కోసం ఇవ్వాలి అని అడిగాను. ఫైనల్లీ మారుతి నాకోసం ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ తీసుకువచ్చారు. మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత మీదే. సంక్రాంతి పండుగ సందర్భంగా నా మూవీతో పాటు పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సంక్రాంతి బరిలో అయినా, ఎప్పుడైనా సీనియర్ల తర్వాతనే మేము. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలతో పాటు మా సినిమాని కూడా సక్సెస్ చేయండి’ అని ప్రభాస్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.