Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. డార్లింగ్ గురించి ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్ కనకాల..

'ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న'.. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు ప్రభాస్. ఇతరులకు సాయం చెయ్యడానికి అతను ఎప్పుడు వెనకాడడు. తాజాగా ఎవరికీ తెలియకుండా ప్రభాస్ చేస్తోన్న ఒక మంచి పని గురించి బయట పెట్టాడు రాజీవ్ కనకాల.

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. డార్లింగ్ గురించి ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్ కనకాల..
Prabhas, Rajeev Kanakala

Updated on: Dec 24, 2025 | 6:35 AM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చెప్పినట్లు ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా హీరో చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అవి కూడా అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. స్టార్ డైరెక్టర్ల చిత్రాలే. అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ కు కోట్లాది మంది అభిమానులుండడానికి అతని సినిమాలు మాత్రమే కాదు.. అతని గొప్ప మనసు కూడా. తన తోటీ నటీ నటులు, సినిమా టెక్నీషియన్ల మొదలు అభిమానుల వరకూ అందరినీ ఎంతో గౌరవిస్తాడు ప్రభాస్. ఇక కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటూ ఎన్నో గుప్త దానాలు కూడా చేస్తున్నాడీ స్టార్ హీరో. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల హీరో ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకన్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అక్కడ మాట్లాడుతూ.. ‘మేము ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం ప్రారంభించాం. డైరెక్టర్ రాజమౌళి, రమా, రమా ప్రభా గారు, ప్రభాస్ ఆ హోమ్ కట్టించడానికి ముందుకు వచ్చారు. అందరం కలిసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ను కట్టించాము.. అంతటితో మా పని అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత మేమెవ్వరం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే.. ప్రభాస్ ఇప్పటికీ ఆ హోమ్ కి డబ్బులు పంపిస్తున్నాడు.. ఇలాంటి మంచి గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి’ అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అభిమానులు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. మరొకరికి సాయం చేయడంలో మా ప్రభాస్ మహారాజే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు. దీంతో పాటుగా డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజి సినిమాలో నటిస్తున్నాడు డార్లింగ్.. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు. వీటితో పాటు కల్కి2, సలార్ 2 మూవీస్ కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.