Tollywood : అతడు మాములోడు కాదు.. ఆ డైరెక్టర్‏కు ఉన్న తెలివి ఎవరికీ ఉండదు.. పోసాని కృష్ణమురళీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు పోసాని కృష్ణ మురళి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. ముఖ్యంగా రాజా అనే డైలాగ్ తో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. విలనిజంలోనూ కామెడీని పండించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే పలువురు హీరోలతో తనకున్న బంధం గురించి చెప్పుకొచ్చారు.

Tollywood : అతడు మాములోడు కాదు.. ఆ డైరెక్టర్‏కు ఉన్న తెలివి ఎవరికీ ఉండదు.. పోసాని కృష్ణమురళీ..
Posani Krishna Murali

Updated on: Jul 14, 2026 | 6:13 PM

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వ ప్రతిభపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీని వన్ ఆఫ్ ద టాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అని అన్నారు. సినిమా టెక్నిక్‌పై ఆర్జీవీకి ఉన్న జ్ఞానం మరెవ్వరికీ లేదని, మణిరత్నానికి కూడా తెలియదని పోసాని పేర్కొన్నారు. ఆర్జీవీ షార్ప్‌నెస్, క్రియేటివిటీ, జీనియస్ స్థాయిని తాను రెండు మూడేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించడం వల్ల తెలుసునని చెప్పారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రామ్ గోపాల్ వర్మ ఒక జీనియస్ అని పోసాని చెప్పుకొచ్చారు. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా ఎన్నో ఫ్లాపులు తీశారని, కానీ అది వారి గొప్పతనాన్ని తగ్గించదని, సబ్జెక్టు సరిలేక ఫ్లాప్ అవుతాయి తప్ప డైరెక్టర్ ఫెయిల్ అవ్వడని పోసాని అన్నారు. తన సొంత అనుభవాలను పంచుకుంటూ, తాను దర్శకత్వం వహించిన ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. ఫ్లాప్ అయినప్పటికీ, ధైర్యం కోల్పోకుండా స్వయంగా కథ రాసుకుని ఆపరేషన్ దుర్యోధన చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, కౌంట్లెస్ డబ్బులు ఎలా వచ్చిపడ్డాయో గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

ఆపరేషన్ దుర్యోధన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిన చివరి సినిమా అని, ఇప్పటికీ దానికి ఒక ప్రత్యేకత ఉందని పోసాని గర్వంగా చెప్పారు. “లాస్ట్ సినిమా వంద రోజులు ఆడిన సినిమా నా సినిమా ఆపరేషన్ దుర్యోధన. అప్పటి నుంచి ఇప్పటిదాకా వంద రోజులు లేదు” అని ఆయన అన్నారు. శ్రీకాంత్‌తో తనకున్న ప్రత్యేక బాండింగ్‌ను ప్రస్తావించారు. శ్రీకాంత్ తన థాట్ ప్రాసెస్, కొత్త ఆలోచనలకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తుంటాడని, “ప్లేయర్స్” లాంటి మంచి సినిమాలు రాశానని గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్‌తో తన అనుబంధానికి కారణం ఏమిటంటే, సూపర్ స్టార్ కృష్ణకు తాను చిన్నప్పటి నుంచి అభిమానినని, శ్రీకాంత్ తనకు జూనియర్ కృష్ణ లాంటివాడని పోసాని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

కృష్ణగారి పట్ల తనకున్న అభిమానాన్ని, ఒకసారి కృష్ణ కంటికి దెబ్బ తగిలినప్పుడు తాను ఎలా స్పందించానో గుర్తు చేసుకున్నారు. తాను జీవితంలో ఎత్తుపల్లాలను చూశానని పోసాని పేర్కొన్నారు. జీవితం చాలా పెద్దదని, అభిప్రాయ భేదాలు ఉన్నా ఎవరినీ ద్వేషిస్తూ కూర్చోనని, ప్రశాంతంగా ఉంటానని తన జీవన తత్వాన్ని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us