Pooja Hegde: విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తోన్న పూజా హెగ్డే.. ఎక్కడో తెలుసా..

పూజా హెగ్డే అగ్రకథనాయకల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆమె వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతిదీ ఎంజాయ్ చేస్తోన్నారు. ముంబైలో తన కలల ఇంటిని నిర్మించడంతో ఆమె తన కలను నిజం చేసుకుంటుంది...

Pooja Hegde: విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తోన్న పూజా హెగ్డే.. ఎక్కడో తెలుసా..
Pooja

Updated on: Oct 27, 2021 | 7:47 PM

పూజా హెగ్డే అగ్రకథనాయకల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆమె వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతిదీ ఎంజాయ్ చేస్తోన్నారు. ముంబైలో తన కలల ఇంటిని నిర్మించడంతో ఆమె తన కలను నిజం చేసుకుంటుంది. పూజా హెగ్డే కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. పెయింటింగ్ పనులను పరిశీలిస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” బిల్డింగ్ మై డ్రిమ్స్” అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఇంటి పనులన్నీ అమ్మే చేస్తుందని కూడా తెలిపారు.

పూజా హెగ్డే, ఆమె కుటుంబం దక్షిణాదికి చెందినప్పటికీ, వారు ముంబైలో స్థిరపడ్డారు. పూజా హెగ్డే ఇప్పుడు తన కోసం, తన తల్లిదండ్రుల కోసం ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ అందాల భామ విజయ్ ‘మృగం’, త్రివిక్రమ్ – మహేష్ బాబుతో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆమె ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో మంచి సక్సెస్ సాధించారు. ఆమె గతంలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలా వైకుంఠపురం, దువ్వాడ జగన్నాథం, మహర్షి, అరవింద సమేత, వాల్మికి నటించి విజయం సొంతం చేసుకున్నారు.

Read Also.. Romantic: “రొమాంటిక్” హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us