రష్మిక డీప్ ఫేక్ వీడియో వెనక బీహార్ బ్యాచ్.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు కానీ..!

వేరే యువతీ వీడియోకు రష్మిక మొఖాన్నిమార్ఫింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియో బోల్డ్ గా ఉండటంతో తెగ వైరల్ అయ్యింది. దీని పై రష్మిక స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేసింది. ఆ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు రష్మిక ఫేక్ వీడియో పై స్పందించారు. ఇలాంటివి జరగకుండా చూడాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

రష్మిక డీప్ ఫేక్ వీడియో వెనక బీహార్ బ్యాచ్.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు కానీ..!
Rashmika

Updated on: Nov 17, 2023 | 9:53 AM

ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వేరే యువతీ వీడియోకు రష్మిక మొఖాన్నిమార్ఫింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియో బోల్డ్ గా ఉండటంతో తెగ వైరల్ అయ్యింది. దీని పై రష్మిక స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేసింది. ఆ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు రష్మిక ఫేక్ వీడియో పై స్పందించారు. ఇలాంటివి జరగకుండా చూడాలి అంటూ విజ్ఞప్తి చేశారు. నాగ చైతన్య, రక్షిత్ శెట్టి, కీర్తిసురేష్ తో పాటు పలువురు రష్మిక వీడియో పై స్పందించారు. రష్మిక తర్వాత మరికొంతమంది ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమించాయి.

రష్మిక ఫేక్ వీడియో వెనక బీహార్ గ్యాంగ్ ఉందని పోలీసులు కనిపెట్టారు. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి రష్మిక ఫేక్ వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేశాడని పోలీస్లు గుర్తించారు. రష్మిక వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. దాంతో దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో బీహార్ కు చెందిన ఓ వ్యక్తిని ఆదిపులోకి తీసుకున్నారు.

అయితే ఆ వ్యక్తి వయసు కేవలం 19 సంవత్సరాలే అని తెలుస్తోంది. ఆ యువకుడి అకౌంట్ నుంచే రష్మిక వీడియో షేర్ అయ్యింది. అయితే ఆ యువకుడు.. తనకు వేరే  వాళ్ల అకౌంట్ నుంచి ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి ఫార్వార్డ్ చేశాను అని చెప్తున్నాడు. దాంతో పోలీసులు తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ వీడియో క్రియేట్ చేసింది ఎవరు అనే దానిపై ఢిల్లీ పోలీసులు దృష్టి పెట్టారు.

 రష్మిక మందన్న ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.