
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ సింగిల్‌గా ఉంటూ.. లైమ్ లైట్‌లో ఉండే స్టార్ హీరోయిన్ త్రిష. వయసు 40 దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. సినిమాలు మాత్రమే కాదు.. పెళ్లి న్యూస్‌తో కూడా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది ఈ చెన్నై బ్యూటీ. తాజాగా మరోసారి పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా త్రిష పెళ్లి ఫిక్స్ అయిపోయిందట.. అనే రూమర్లు టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
గుర్తుందా..? కొన్నేళ్ల కింద త్రిష చెన్నైకి చెందిన బిజినెస్ మాన్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గ్రాండ్‌గా జరిగిన ఆ ఎంగేజ్‌మెంట్.. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే రద్దు అయిపోయింది. ఆ తర్వాత త్రిష కెరీర్‌పైనే దృష్టి పెట్టి వరుస సినిమాలు చేసింది. అయితే ఆ బ్రేక్-అప్ వెనక కారణాలపై కూడా అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి. ఫ్యామిలీ ఇష్యూస్, లైఫ్‌స్టైల్ డిఫరెన్స్ అంటూ గాసిప్స్ బాగానే వచ్చాయి. అంతే కాదు త్రిషకు తోటి హీరోలతో రిలేషన్ రూమర్స్ కూడా చాలా సార్లు వచ్చాయి. శింబుతో విన్నైతాండి వరువాయా సమయంలో కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లోకి వెళ్ళిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిద్ధార్థ్‌తో ఆమె ఫ్రెండ్‌షిప్ కూడా కొత్త మసాలా ఇచ్చింది. ఒక్క దశలో త్రిష, దళపతి విజయ్ కాంబినేషన్ కూడా చర్చల్లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కోలీవుడ్‌లోనూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రతిసారి త్రిష సైలెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎప్పటిలాగే తన ప్రైవేట్ లైఫ్ గురించి నోరు విప్పలేదు.
ఇప్పుడు మళ్లీ ఓ కొత్త బిజినెస్ మాన్ త్రిష జీవితంలోకి ఎంటర్ అయ్యాడని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. చెన్నైలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అని చాలా సైట్స్ ఊదరగొట్టాయి. ఇద్దరూ గత ఏడాది నుంచి క్లోజ్‌గా ఉన్నారని.. ఇప్పుడు పెళ్లి డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయంటూ న్యూస్ సర్కులేట్ అయింది. అయితే త్రిష మాత్రం ఈ వార్తలపై ఘాటుగా రియాక్టయింది. నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్నవారిని నేను ప్రేమిస్తా.. హనిమూన్ షెడ్యూల్ కూడా చెబుతారని వెయిటింగ్ అంటూ త్రిష సెటైరికల్ పోస్ట్ పెట్టింది. దీంతో మరోసారి ఆమె పెళ్లి వార్తలను ఖరాఖండిగా ఖండించినట్లైంది.
వయసు 42 దాటినా.. త్రిష గ్లామర్, గ్రేస్ మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర, తమిళంలో సూర్య కరుప్పుతో పాటు మరిన్ని సినిమాలు చేస్తుంది.
Trisha Post