Rakul Preet Singh: ప్లోరల్ డిజైనర్ డ్రస్‌లో దుమారంరేపుతోన్న వయ్యారి భామ.. రకుల్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే

|

Jul 17, 2022 | 4:39 PM

వెంకటాద్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

Rakul Preet Singh: ప్లోరల్ డిజైనర్ డ్రస్‌లో దుమారంరేపుతోన్న వయ్యారి భామ.. రకుల్ అందాలకు ఫిదా అవ్వాల్సిందే
Rakul
Follow us on

వెంకటాద్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దర్శక నిర్మాతల దృష్టి రకుల్ పై పడింది. ఆ సినిమాతర్వాత క్రేజీ ఆఫర్స్ ఈ అమ్మడిని వెతుకుంటూ వచ్చాయి. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు కూర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , మహేష్ లాటి స్టార్ హీరోలతో పాటు.. రవితేజ, కింగ్ నాగార్జున లాంటి సీనియర్స్ సరసన నటించింది రకుల్. ఇక ఈ అమ్మడికి ఇటీవల అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తుంది. తెలుగు ఈ అమ్మడు చివరగా నటించిన కొండపోలం సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవ్వలేదు. అటు బాలీవుడ్ లోనూ అమ్మడి హవా అంతంతమాత్రంగానే ఉంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగా విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది రకుల్. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు వెళ్లిన రకుల్ అందరి దృష్టిని ఆకర్షించింది. డిజైనర్ వేర్ డ్రస్ లో తళుక్కుమంది ఈ భామ. బ్లాక్ కలర్ ప్లోరల్ డిజైనర్ డ్రస్ లో రకుల్ మతిపోగొట్టింది. అమ్మడి అందానికి అక్కా ఉన్నవారంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసింది. ఈ హాట్ హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి