Folk Song : పేరుగల్ల పెద్దిరెడ్డి పాటతో సంచలనం.. ఆ సింగర్ జీవితంలో గుండె తరుక్కుపోయే కష్టాలు..

పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోయ్ ఓ రామచిలుక.. ఇప్పుడు యూట్యూబ్ లో మారుమోగుతున్న తెలంగాణ జానపదం. ఇప్పటికే 54 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ అభినయం.. సింగర్ మమతా రమేశ్ అందమైన గాత్రం ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Folk Song : పేరుగల్ల పెద్దిరెడ్డి పాటతో సంచలనం.. ఆ సింగర్ జీవితంలో గుండె తరుక్కుపోయే కష్టాలు..
Singer Mamatha Ramesh

Updated on: Jan 14, 2026 | 7:39 PM

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ జానపదాలకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చెప్పక్కర్లేదు. మొన్నటివరకు రాను బొంబాయికి రాను, బాయిలోన బల్లిపలికే పాటలు సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి పాట రచ్చ చేస్తుంది. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ అభినయంతో పాటకు హైలెట్ కాగా.. ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే లిరిక్స్ అందంగా ఆలపించింది సింగర్ మమతా రమేశ్. సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. సక్కనోడ నా బావ పాటతో మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మమతా రమేశ్.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నానాజ్ పూర్ గ్రామం స్వస్థలం. డిగ్రీ వరకు చదువుకున్న ఆమెకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

స్కూల్, కాలేజీ కార్యక్రమాల్లో పాటలు పాడేది. యూట్యూబ్ లో అవకాశం వస్తే పాడాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. 2022లో సక్కనోడ నా బావ.. నన్ను హైదరాబాద్ కు తీసుకుపోవా పాటతో ఆమె పేరు సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బావో బంగారం పాటతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇక ఇప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి పాటతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో టాప్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

డిగ్రీ తర్వాత హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా జాబ్ చేసింది. అక్కడే పనిచేస్తున్న సేల్స్ బాయ్ గా పనిచేస్తున్న రమేశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2016లో ఇద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. జీవితంలో సాఫీగా సాగిపోతున్న సమయంలోనే 2018లో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఆమెను వెంటాడింది. శరీరమంతా ఇన్ఫెక్షన్, ముక్కులోనుంచి రక్తస్రావం కావడం స్టార్ట్ అయ్యింది. ఈ వ్యాధికి చికిత్స కోసం స్టెరియిడ్స్ ఇవ్వడంతో కాళ్ల ఎముకలు అరిగిపోయాయి. ఎక్కువ సేపు కూర్చోలేదు. నడవలేదు. రోజూ మందులు వాడుతూనే పాటల ప్రయాణం సాగిస్తుంది.’

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..