Pawan Kalyan: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలతో రానున్న పవన్ కళ్యాణ్,,

ఒక్కటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ.. ఆయన ప్రతీసారి అలాగే అంటాడు.. ఒక్కటి కూడా పూర్తి చేయడు అనుకుంటున్నారేమో.. కానీ ఈ సారి ప్లానింగ్ మామూలుగా లేదు. మరి జనసేనాని చేయబోయే ఆ మ్యాజిక్ ఏంటి..? 2024 ఎలా ఉండబోతుంది..?  పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదల కాకపోయినా.. రీ రిలీజ్‌లతో ఈ మధ్య పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 31న గుడూంబా శంకర్, సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ కూడా రీ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Pawan Kalyan: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలతో రానున్న పవన్ కళ్యాణ్,,
Pawan Kalyan

Edited By:

Updated on: Aug 15, 2023 | 1:45 PM

2024 ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. సినిమాల్లో మాత్రం దద్ధరిల్లిపోవడం ఖాయం. ఒక్కటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ.. ఆయన ప్రతీసారి అలాగే అంటాడు.. ఒక్కటి కూడా పూర్తి చేయడు అనుకుంటున్నారేమో.. కానీ ఈ సారి ప్లానింగ్ మామూలుగా లేదు. మరి జనసేనాని చేయబోయే ఆ మ్యాజిక్ ఏంటి..? 2024 ఎలా ఉండబోతుంది..?  పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదల కాకపోయినా.. రీ రిలీజ్‌లతో ఈ మధ్య పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 31న గుడూంబా శంకర్, సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ కూడా రీ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

అయితే 2024లో మాత్రం మీకు ఆ అవసరం ఉండదులే అంటున్నారు పవన్. ఓ వైపు ఎలక్షన్స్ ఉన్నా.. మూడు సినిమాలతో 2024ని పవర్ ఫుల్‌గా మార్చేయబోతున్నారు జనసేనాని. దానికోసమే ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్క సినిమానే పూర్తి చేసే సమయమే పవన్ కళ్యాణ్ దగ్గర లేదిప్పుడు.. అలాంటిది ఒకే ఏడాది మూడు సినిమాలు చేస్తారా అనే అనుమానాలు రావొచ్చు. కానీ అన్నీ వస్తాయంటున్నారు పవన్. ఉస్తాద్‌ భగత్ సింగ్ కోసం రాబోయే ఆర్నెళ్లు నెలలో 10 రోజులు అడ్జస్ట్ ఇవ్వనున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోను దీన్ని ఎన్నికల ముందే విడుదల చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ తర్వాతే OG విడుదల కానుంది.

OG షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. 2024 సమ్మర్ తర్వాత దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మార్చ్, ఎప్రిల్‌లో ఉస్తాద్ రిలీజ్ ఉండొచ్చు. ఈ రెండూ అయ్యాక.. ఎన్నికలు పూర్తయ్యాక హరిహర వీరమల్లు పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఒప్పుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారీయన. మొత్తానికి 2024లో నిజంగా మూడు సినిమాలతో వస్తే.. పవన్ కళ్యాణ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న og పై భారీ అంచనాలు ఉన్నాయి.

హరీష్ శంకర్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో మరో బబ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.