పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. తాజాగా సినిమాల్లో నటించడంపై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ..” అభిమానులు ఓజీ అంటే నాకు మోదీ లాగా వినిపించేది. ముందు కడుపు నిండే పనిచేద్దాం.. ఆ తర్వాత సినిమా. రోడ్లు, స్కూల్స్ బాగుచేసుకుందాం.. ఆ తర్వాతే వినోదాలు, విందులు. ప్రజలు, అభిమానులు సినిమాకు వెళ్లాలన్నా రోడ్లు బాగుండాలి. టికెట్ కొనుక్కోవలన్నా చేతిలో డబ్బులు ఉండాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ముందు బాధ్యత.. ఆ తర్వాత సినిమా అని అన్నారుపవన్
అలాగే పవన్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఏ హీరోతో నాకు పోటీ లేదు.. ఇబ్బంది లేదు అని అన్నారు. హీరోలందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందుకే ఆర్థిక వ్యవస్థపై ముందు దృష్టి పెడదాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.