
ఇద్దరు మెగా హీరోలను కలిసి చుడాలిని ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన ఆచార్య సినిమా దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు బ్రో సినిమా పైనే ఆశాలు పెట్టుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సముద్ర ఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జులై 28న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
ఈ క్రమంలో బ్రో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ , తేజ్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు అభిమానులు. త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.