Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. బుర్జ్ ఖలీఫాపై వీరమల్లు ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు' సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేయనున్నారు.

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. బుర్జ్ ఖలీఫాపై వీరమల్లు ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే?
Hari Hara Veera Mallu Movie

Updated on: May 18, 2025 | 11:15 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. మొదటగా ఆయన నటించిన ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అంతేకాదు ‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రమోషన్ భిన్నంగా, గ్రాండ్‌గా చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై ‘హరి హర్ వీర మల్లు’ సినిమా ట్రైలర్ విడుదలచేయనున్నటులు తెలుస్తోంది. బుర్జ్ ఖలీఫాపై ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా టీజర్, ట్రైలర్ ప్రదర్శించలేదు. ఒక వేళ ప్రచారం సాగుతున్నట్లు హరిహరి వీరమల్లు ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే, అక్కడ రిలీజైన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డ్ సృష్టించనుంది. బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ చాలా బిజీగా మారిపోయాడు. సినిమాల నుంచి బాగా దూరమయ్యారు. అయితే ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ కోసం కొంత సమయం కేటాయించి సినిమాను పూర్తి చేశారు. ‘హరి హర వీర మల్లు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు సినీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న హరి హర వీర మల్లు చిత్రం జూన్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

జూన్ 12న గ్రాండ్ రిలీజ్..

 

17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా హరి హర వీర మల్లు సినిమాలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఈ సినిమా కొంత భాగానికి క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వం వహిస్తే, మరి కొంత భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే విలన్ గా బాబీ డియోల్ కనిపించనున్నాడు. వీరితో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.