Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..

|

Apr 19, 2022 | 12:45 PM

Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా..

Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..
Chiranjeevi Ram Charan Pawa
Follow us on

Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో  తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

యూసఫ్‌‌‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌‌‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్టుగా సమాచారం. ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. దీంతో మెగా అభిమానులకు కనుల పండగగా ఒకే వేదిక పై మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు సందడి చేయనున్నారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడ కేంద్రంగా జరపనున్నట్లు.. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం కూడా జరిగింది. అనంతరం ఈ వేడుకను హైదరాబాద్ కు  చిత్ర యూనిట్ మార్చింది.

ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల. రేజీనా ఓ స్పెషల్ సాంగ్‌‌‌లో మెరుస్తోంది.

Also Read: Modi Gujarat Tour: సొంత రాష్ట్రానికి ప్రధాని నరంద్ర మోదీ కానుకల వర్షం.. గ్లోబల్ మెడిసిన్ సెంటర్‌, డెయిరీ కాంప్లెక్స్‌‌కు శ్రీకారం

JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి

Hyderabad: కేంద్రంలో ఉంది ఎన్డీఏ కాదు.. NPA .. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు