Kushi Re Release Trailer: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఖుషి’ రీ రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

|

Dec 26, 2022 | 6:05 AM

ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజై థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఖుషి’..

Kushi Re Release Trailer: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఖుషి’ రీ రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది..
Kushi Movie Rereleasing
Follow us on

Kushi Re Release: ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమా రీరిలిజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది.

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ సినిమాను డిసెంబర్‌ 31న రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిడుదల చేశారు. ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వార్తలు రాసే సమయానికి లక్షకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకపోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..