ఫ్యాన్స్‌కి పూనకాలే..పవన్‌తో హరిష్ శంకర్ మూవీ ఫిక్స్..

పవన్ వరస సినిమాలతో దుమ్ములేపుతున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే..మరోవైపు వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు క్రిష్‌తో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. మరోవైపు..పక్కా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మూవీ కూడా తాజాగా కన్ఫామ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్‌తో తెలిపింది. గతంలో పవన్, హరీష్ శంకర్ కలిసి ఇండస్ట్రీ హిట్ అయిన గబ్బర్ సింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలు […]

ఫ్యాన్స్‌కి పూనకాలే..పవన్‌తో హరిష్ శంకర్ మూవీ ఫిక్స్..

పవన్ వరస సినిమాలతో దుమ్ములేపుతున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే..మరోవైపు వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు క్రిష్‌తో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. మరోవైపు..పక్కా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో మూవీ కూడా తాజాగా కన్ఫామ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్‌తో తెలిపింది. గతంలో పవన్, హరీష్ శంకర్ కలిసి ఇండస్ట్రీ హిట్ అయిన గబ్బర్ సింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలు ప్లాపైన తర్వాత గబ్బర్ సింగ్ మూవీతో పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు హరీశ్. ఫుల్ ఎలివేషన్ సీన్స్‌‌తో పవర్ స్టార్‌ని మరో కోణంలో  ఆవిష్కరించాడు. వాస్తవంగా పవన్‌కు హరీశ్ విరాభిమాని. కట్టే కాలు వరకు పవన్ అభిమానినే అని పలు వేదికల్లో సైతం ఎన్నోసార్లు చెప్పాడు. దీంతో తాజా మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా సినిమాల నటించే విషయం గురించి పవన్ తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు. తనకు, తన కుటుబాన్ని పోషించుకోవడానికి..పార్టీని నడపడానికి సినిమాలు చేస్తానని తేల్చి చెప్పాడు.

Published On - 12:21 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu