ఇద్ద‌రూ వ‌చ్చి ఆశీర్వ‌దించారు..సందేహాలు తీర్చేశారు

టాలీవుడ్ హీరో నితిన్ ఇంట‌ పెళ్లి సందడి జోరందుకుంది. ఈ బుధవారం నుంచి పెళ్లి వేడుకలు మొద‌ల‌య్యాయి.

ఇద్ద‌రూ వ‌చ్చి ఆశీర్వ‌దించారు..సందేహాలు తీర్చేశారు

Updated on: Jul 24, 2020 | 7:13 PM

టాలీవుడ్ హీరో నితిన్ ఇంట‌ పెళ్లి సందడి జోరందుకుంది. ఈ బుధవారం నుంచి పెళ్లి వేడుకలు మొద‌ల‌య్యాయి. ఆ రోజున‌ నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించారు. కోవిడ్ నేప‌థ్యంలో ప‌రిమిత అతిథుల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కాగా నేడు నితిన్ ను పెళ్లి కొడుకును చేసే వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, నిర్మాత రాధా కృష్ణ విచ్చేశారు.

ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ ల‌ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇద్ద‌రూ కలసి నితిన్ ఇంటికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఆర్జీవీ తీసిన‌ ‘పవర్ స్టార్’ సినిమా విడుదల నేపధ్యంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికపై ప్రచారంలో ఉన్న పలు ప్రశ్నలకు సమాధానం ఇదే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తనను ఆశీర్వాదించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చినబాబులకు ధన్యవాదాలు తెలిపాడు నితిన్. కాగా ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు.