Patas Praveen: ఆమె నాకు అమ్మలా ధైర్యం చెప్పింది.. నాన్న ఆసుపత్రిలో ఉండగా ఎంతో సాయం చేశారు..

తెలుగు బుల్లితెరపై పటాస్ ప్రవీణ్ ప్రముఖ హాస్యనటుడిగా (కమెడియన్) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న చిన్న స్టేజ్ షోలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రవీణ్, 'పటాస్' షోతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. పటాస్ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ కామెడీ షోలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈయన ఇటీవలే నటి, డ్యాన్సర్ అయిన వంశితను వివాహం చేసుకున్నారు.

Patas Praveen: ఆమె నాకు అమ్మలా ధైర్యం చెప్పింది.. నాన్న ఆసుపత్రిలో ఉండగా ఎంతో సాయం చేశారు..
Jabardasth Praveen

Updated on: May 30, 2026 | 7:28 PM

పటాస్ ప్రవీణ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా తన కామెడీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే తన ప్రేయసితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. 2018-19లో పటాస్ టీమ్ సభ్యునిగా ఉన్నప్పుడు జబర్దస్త్ సెట్‌లోకి తమను రానివ్వలేదని, పటాస్ వాళ్లు అటు వెళ్లండి అని దూరం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో జబర్దస్త్ వేదికపై ప్రదర్శన ఇవ్వాలని తను చాలా కలలు కన్నానని, కానీ ఆ అవకాశం వచ్చేలోపే నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయారని ప్రవీణ్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు తిరిగి రావడంతో, ఆయన ముందు ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, నాగబాబుని కలిసి ఈ విషయాన్ని పంచుకున్నానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ప్రవీణ్ తన జీవితంలో నటి ఇంద్రజ పాత్ర గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఇంద్రజను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ, ఆమెతో తనకున్న బంధాన్ని వివరించారు. పరిశ్రమలో తనను ఆడియన్స్‌తో పాటు ఇంద్రజ కూడా ఎంతో ప్రోత్సహించారని, తాను మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా వెంటనే స్పందించి మాట్లాడేవారని తెలిపారు. తన తండ్రి ఆసుపత్రిలో మంచాన పడి, చనిపోయే వరకు తనకు డబ్బులు లేని సమయంలో ఇంద్రజ నిరంతరం ఆర్థిక సహాయం పంపించారని ప్రవీణ్ వెల్లడించారు. నాన్న ఎలా ఉన్నావు? నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా, నేను చూసుకుంటాను అని ఆమె ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, ఆ కష్ట సమయంలో తనకు ఎవరూ లేరనే బాధను ఇంద్రజ దూరం చేశారని ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తనకు అమ్మ వంటివారని ప్రవీణ్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఇటీవల జరిగిన ఒక సీరియల్ షూటింగ్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని కూడా ప్రవీణ్ పంచుకున్నారు. తాను కొత్తగా సీరియల్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు, డైరెక్టర్ , మేనేజర్ సందీప్ బాగా మాట్లాడారని తెలిపారు. అయితే, ఒక కో-డైరెక్టర్ తనను పది మంది ముందు కించపరిచేలా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌డోర్ షూటింగ్‌లో తాను డైలాగులు చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నప్పుడు, ఏయ్ నీకు యాక్టింగ్ రాదా? నువ్వు యాక్టర్‌వి కదా? అని నిలదీస్తూ, అసభ్యకరంగా మాట్లారని ప్రవీణ్ చెప్పారు. తాను ఇండస్ట్రీకి ఎవరి అవకాశం అడిగి రాలేదని, తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాతే అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Follow Us