Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’లో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ సినిమాను విశ్లేషించిన ప్రముఖ రచయిత పరుచూరి రామ్ చరణ్ మూవీలోని లోపాల గురించి తెలియజేశారు.

Peddi Movie: రామ్ చరణ్ పెద్దిలో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ
Paruchuri Gopala Krishna, Ram Charan

Updated on: Aug 07, 2026 | 10:31 PM

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్‌ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, శివరాజ్‌కుమార్‌, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న రిలీజైన పెద్ది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ మెగా మూవీ ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, రచయిత పెద్ది సినిమాను చూశారు. అనంతరం ఈ మెగా మూవీపై తన అభిప్రాయలను పరుచూరి పాఠాలు అనే యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది సినిమాలోని హైలెట్ అంశాలతో పాటు లోపాల గురించి కూడా మాట్లాడారు పరుచూరి.

‘ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్‌తో మూడు గంటలకు పైగా సినిమాను నడిపించడం సాహసమే. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే చివర్లో ఇచ్చిన సందేశం కూడా నాకు బాగా నచ్చింది. అయితే సినిమా నిడివి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఈ సినిమాలో హీరోగా రామ్‌ చరణ్ కాకుండా మరెవరైనా చేసి ఉంటే.. ఈ మాత్రం ఫలితం అయినా వచ్చేది కాదని నా అనుమానం. సినిమా మొత్తాన్ని చరణ్‌ తన భుజాలపై మోశారు. రికార్డు కలెక్షన్లు రావడానికి మొదటి కారణం కూడా అతడే. అలాగే ఇందులో జగపతిబాబుది కూడా అద్భుతమైన పాత్ర. ప్రాణంపెట్టి చేశాడు. ఏఆర్‌ రెహమన్‌ మంచి సంగీతం అందించారు. ఓట్లే లేని ఊర్లో రైలు ఆగాలనే అంశాన్ని తీసుకుని గొప్పగా కథను రాసుకున్నారు. ఎలా అయినా ఈ ఊరికి గుర్తింపు తీసుకురావాలని హీరో క్రికెట్‌, కుస్తీల్లో ఓడిపోయినప్పటికీ.. చివర్లో రన్నింగ్‌లో సత్తా చాటి తన పోరాటంలో అనుకున్నది సాధిస్తాడు. ఈ సినిమాలోని మైనస్‌లలో ఒకటి ఏంటంటే.. ఇందులో హీరో హీరోయిన్స్ వేషధారణలు ఏవీ తెలుగు వాళ్లకు నచ్చేలా లేవు. బహుశా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్లలా చూపించాలనే ఉద్దేశంలో అలా కాస్ట్యూమ్స్ ను ఎంచుకుని ఉండొచ్చు. ఇక హీరోయిన్‌ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంది. అలాగే సినిమా రన్‌టైమ్‌ని కూడా ఒక 30- 40 నిమిషాలు తగ్గించొచ్చు. ఈ మార్పు చేసి.. హీరోయిన్‌ పాత్ర ఎక్కువ చూపించి ఉంటే ఓటీటీలో ఇంకా ఎక్కువమంది చూసేవాళ్లేమో’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us