
98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం, అవార్డు కార్యక్రమం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ స్టూడియోస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హాలీవుడ్‌తో సహా చలనచిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇండియా నుంచి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ హవా సాగింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో ఈ చిత్రంలో హీరో. పాల్ థామస్ ఆండర్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రం మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో చూడటానికి అందుబాటులో ఉంది. ఇక ‘హామ్నెట్’ చిత్రంలో నటనకు జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ‘సిన్నర్స్’ చిత్రంలో నటనకు మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. దీంతో పాటు వివిధ చిత్రాలకు, నటులకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. మరి ఆస్కార్ లో సత్తా చాటిన సినిమాలు ఇప్పుడు ఏయే ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం రండి.
గమనిక: ఈ చిత్రాలలో కొన్ని మన ఇండియాలో అందుబాటులో లేవు. ఇంకొన్ని స్ట్రీమింగ్ కు రాలేదు .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.