పవన్​-క్రిష్​ సినిమాకు ఆసక్తికర టైటిల్ !

|

Sep 14, 2020 | 11:07 AM

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, డైరెక్టర్ క్రిష్​ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే  ఇందుకు సంబంధించిన ​ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 

పవన్​-క్రిష్​ సినిమాకు ఆసక్తికర టైటిల్ !
Follow us on

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, డైరెక్టర్ క్రిష్​ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే  ఇందుకు సంబంధించిన ​ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్​పై ఇంట్రస్టింగ్ అప్​డేట్​ అందుతోంది. ఈ చిత్రానికి ‘ఓం శివమ్’​ అనే టైటిల్​ను ఫైనల్  చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ పీకే సరసన నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్​ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తున్నారట మేకర్స్.  ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నారని టాక్.

Read More :

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

ప్రేమ గాయం : బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య