AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త మ‌హి వి.రాఘ‌వ్ నుంచి రాబోతున్న మ‌రో స‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..
Om Shanthi Disco Shanthi
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2026 | 8:27 PM

Share

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి వి. రాఘవ్. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో హారర్ కామెడీ జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన, ఆ తర్వాత ‘యాత్ర’, ఇటీవల వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఆయన నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషులను భయపెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఈ సినిమాలో దెయ్యాలకే చుక్కలు చూపించే వ్యక్తులు ఎదురైతే ఎలా ఉంటుందనే సరికొత్త పాయింట్‌తో మహి వి. రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భయం అంటే ఏంటో తెలియని కొందరు పిచ్చివాళ్లు ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లడం, అక్కడ ఉండే దెయ్యాలు వారిని భయపెట్టాలని ప్రయత్నించి విఫలం కావడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. దెయ్యాలు పిచ్చివాళ్లను భయపెట్టలేక తలపట్టుకునే సన్నివేశాలు సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్/అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే, ఇది ఒక ‘ఫుల్ ఫన్ రైడ్’ అని స్పష్టమవుతోంది. “నాన్ స్టాప్ అండ్ నాన్ సెన్స్ కామెడీ” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్పూకీ కామెడీని ప్రమోట్ చేస్తున్నారు. జంప్ స్కేర్స్, ఫన్నీ డైలాగ్స్ మరియు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. విభిన్నమైన కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

మహి వి. రాఘవ్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ ‘ఓం శాంతి డిస్కో శాంతి’ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Follow Us