Evaru Meelo koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు ఎన్టీఆర్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.? షాకింగ్‌ రెమ్యునరేషన్‌..

Evaru Meelo koteeswarulu: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నా తనదైన నటన, డైలాగ్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడీ నందమూరి హీరో. ఓ వైపు హీరోగా.

Evaru Meelo koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులుకు ఎన్టీఆర్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.? షాకింగ్‌ రెమ్యునరేషన్‌..
Ntr

Updated on: Mar 13, 2021 | 7:19 PM

Evaru Meelo koteeswarulu: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నా తనదైన నటన, డైలాగ్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడీ నందమూరి హీరో. ఓ వైపు హీరోగా వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వ్యాఖ్యాతగా బుల్లితెరపై కూడా తన సత్త చాటుతున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ రియాలిటీ షో తెలుగులో అంతలా హిట్‌ కావడానికి ఎన్టీఆర్‌ కూడా ఓ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ సుమారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో రాబోతున్నాడు. తాజాగా శనివారం ఈ షోకు సంబంధించి ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారన్న ప్రశ్నకు.. నేరుగా నో చెప్పకుండా. ఇప్పుడు ఇది సందర్భం కాదు అంటూ మాట దాటవేశాడు. దీంతో ఆయన అభిమానుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ షోకోసం ఎన్టీఆర్‌ ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ.1.2 కోట్లు తీసుకుంటున్నాడనేది సదరు వార్త సారాంశం. ఎన్టీఆర్‌ ఈ షోకోసం మొత్తం 30 ఎపిసోడ్లు చేయనున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్‌ రెమ్యునరేషన్‌ అక్షరాల రూ.30 కోట్లకు పైమాటే అన్నమాట. మరి సినిమాల్లో తన డైలాగ్‌లతో మెస్మరైజ్‌ చేసే ఎన్టీఆర్‌.. ప్రశ్నలు సంధిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Also Read: Rana Daggubati: రానా జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చింది ఆ టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఎవరా హీరో..? ఏమా సలహా..?

అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? సోదరికి సలహాలిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

Vijay Devarakonda: బాలీవుడ్‌లో హవా కొనసాగిస్తోన్న ‘రౌడీ బాయ్’‌… విజయ్‌తో జతకట్టనున్న మరో బాలీవుడ్‌ బ్యూటీ..?