Devara: కొరటాల ప్లాన్ మాములుగా లేదుగా.. సీనియర్‌ ఎన్టీఆర్‌, శ్రీదేవి జోడీ గుర్తుచేసేలా…

| Edited By: Rajeev Rayala

Jul 17, 2023 | 12:35 PM

ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు తారక్‌. సినిమా స్టార్ట్ అయి జస్ట్ మూడు నెలలు అయిందో లేదో, అప్పుడే ఐదు షెడ్యూల్స్ కంప్లీట్‌ చేశారు. ఈ స్పీడ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు.

Devara: కొరటాల ప్లాన్ మాములుగా లేదుగా.. సీనియర్‌ ఎన్టీఆర్‌, శ్రీదేవి జోడీ గుర్తుచేసేలా...
Devara
Follow us on

ఆ స్పీడ్‌ ఏంటి? ఆ దూకుడేంటి? అని తారక్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరు హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.. మా హీరో ఇంకా మొదలుపెట్టనే లేదు అంటూ ఆఫ్టర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, తారక్‌ సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు వరుస అప్‌డేట్స్ వింటూ పండగ చేసుకుంటున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు తారక్‌. సినిమా స్టార్ట్ అయి జస్ట్ మూడు నెలలు అయిందో లేదో, అప్పుడే ఐదు షెడ్యూల్స్ కంప్లీట్‌ చేశారు. ఈ స్పీడ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. కమిట్‌మెంట్‌, హార్డ్ వర్క్, డెడికేషన్‌, ప్లానింగ్‌ ఉండబట్టే ఇది సాధ్యమైందని టీమ్‌ని ప్రశంసిస్తున్నారు.

తన డైరక్షన్‌లో వచ్చిన మిర్చి మూవీ కన్నా దేవరలో యాక్షన్‌ డోస్‌ డబుల్‌ ఉంటుందన్నది కొరటాల స్టేట్‌మెంట్‌. మాస్‌ కూడా మరో రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు కెప్టెన్‌. తారక్‌ ఫ్యాన్స్ కి హై ఇచ్చే మూవీ అవుతుందని డిక్లేర్‌ చేశారు. ఈ విషయం జనాలకు ఇప్పుడు చెబుతున్నారు కానీ, తారక్‌తో జనతాగ్యారేజ్‌ సమయంలోనే చెప్పారట కొరటాల. ఈ సారి ఫుల్‌ కమర్షియల్‌ సబ్జెక్ట్ ని, బిగ్గర్‌ కేన్వాస్‌లో తీస్తానని చెబితే, అప్పుడే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట తారక్‌.

మాస్‌ అంటున్నారు. కమర్షియల్‌ అంటున్నారు.. అయితే పనిలో పనిగా పాటల విషయంలోనూ కాస్త ఎక్కువ ఫోకస్‌ పెట్టండి అని రిక్వెస్టులు పంపిస్తున్నారు ఫ్యాన్స్. సీనియర్‌ ఎన్టీఆర్‌, శ్రీదేవి జోడీ గుర్తుకు రాగానే ఆకు చాటు పిందె తడిసే పాట కళ్ల ముందు కదులుతుంది. ఇప్పుడు తారక్‌, జాన్వీ మధ్య కూడా ఆ రేంజ్‌ పాట ఉండేలా చూడమని సజెషన్స్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది దేవర. బాక్సాఫీస్‌ స్టార్మ్ కోసం రెడీగా ఉండండి అంటూ పరస్పరం చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని బ్లాస్ట్ చేసే సినిమా రెడీ కావాలంటే టేకింగ్‌లో ఈ మాత్రం జోరు తప్పనిసరి అనే మాటలు వినిపిస్తున్నాయి. సీజీ వర్క్ ఉన్న షాట్స్ ముందు తీసి, గ్రాఫిక్స్ కోసం పంపిస్తే, పనిలో జాప్యం జరగకుండా ఉంటుందన్న కొరటాల ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు అభిమానులు.