
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పలువురి మనసులను మెలిపెడుతోంది. ఈ ఘటనపై బాలీవుడ్ లోని నెపోటిజంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పలువురు సున్నిత మనస్కులు..సుశాంత్ మరణంతో కలత చెంది తనువు చాలిస్తున్నారు. తాజాగా బిహార్‌కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. హీరో బలవన్మరణానికి పాల్పడినట్టుగానే ఈ బాలుడూ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..గత వారం రోజులుగా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు చూస్తూ ఆ బాలుడు టీవీకి అతుక్కుపోయాడని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. దీంతో తీవ్రంగా కలత చెంది శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు కోరడంతో పోస్టుమార్టం నిర్వహించలేదని అసిస్టెంట్ పోలీస్ సూపరిటెండెంట్ సర్వేస్ మిశ్రా పేర్కొన్నారు. పిల్లల్ని ఇటువంటి వార్తలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.
సుశాంత్ మృతితో ఆవేదన చెందిన ఆయన ఫ్యాన్స్ కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బరౌలీకి చెందిన టెన్త్ విద్యార్థి, ఒడిశాలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్, అదే విధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.