హీరోయిన్.. అందంతోపాటు శారీరాకృతి కూడా ముఖ్యమే అన్న సంగతి తెలిసిందే. వెండితెరపై కథానాయికగా సందడి చేయాలంటే మంచి పర్సనాలిటీ ఉండాల్సిందే. మంచి హైటు, వెయిటు, కలర్, జీరో సైజు ఇలా ఎన్నో రకాల క్వాలిటీస్ ఉండాల్సిందే. అయితే కంటెంట్, పాత్ర ప్రాధాన్యత బట్టి కొన్నిసార్లు తమ రూల్స్ బ్రేక్ చేస్తుంటారు పలువురు హీరోయిన్స్. క్యారెక్టర్ కోసం బరువు పెరగడం.. లేదా పూర్తిగా బరువు తగ్గడం చేస్తుంటారు. కానీ తమదైన నటనతో ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధమే లేదని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అంటే స్టైలీష్ లుక్ మాత్రమే కాదు యాక్టింగ్ ముఖ్యమని నిరూపించారు. హైటు, వెయిటుతో అసలు సంబంధమే లేదని తెల్చీ చెప్పారు. అనుష్క, నిత్యా మీనన్ వంటి స్టార్ హీరోయిన్స్ సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తుంటారు. జీరో సైజు సినిమా కోసం చాలా లావుగా మారిన అనుష్క.. ఆ తర్వాత కాస్త సన్నబడింది. కానీ అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. ఇక ఇటీవలే హీరోయిన్ నిత్యా మీనన్ సైతం బాగానే సైజ్ పెరిగింది. ఇక ఇప్పుడు వీరి దారిలోకి వచ్చింది హీరోయిన్ నివేదా థామస్.
మొన్నటివరకు సన్నజాజీలా ఉండే నివేధా ఇప్పుడు బొద్దుగా మారింది. తాజాగా ఈ బ్యూటీ లుక్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నివేదా లుక్ ఇప్పుడు అందరికి షాకిస్తుంది. అయితే ఆడవారి సహజంగానే వచ్చే ఆరోగ్య సమస్యలు లేదా ఇంకేమైన కారణాలతోనే ఇలా లావు అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. కానీ నివేదా లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నివేదా లుక్ పై విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. కానీ తన లుక్ గురించి వచ్చే ట్రోలింగ్స్ లైట్ తీసుకుంటుంది నివేదా. ఇప్పటికే ఇదే అంశం మీద మీడియా నుంచి ప్రశ్నలు వచ్చినప్పటికీ దాటవేసింది. ప్రస్తుతం 35 చిన్నకథ కాదు అనే సినిమాతో మరోసారి అడియన్స్ మందుకు రాబోతుంది.
అయితే నివేదా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసమే ఇలా వెయిట్ పెరిగింది కావచ్చు.. కానీ ఆ మూవీలో ఏ రోల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ తన లుక్ పై మాత్రం ఈ హీరోయిన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడంలేదు. మరోవైపు నివేదా అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. బొద్దుగా మారిన నివేదా క్యూట్ గానే ఉంది.. ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Nivetha Thomas | #35ChinnaKathaKadu
— Christopher Kanagaraj (@Chrissuccess) August 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.