Nithya Menen: ‘పెళ్లి గిళ్లీ వద్దంట ఇలాగే ఉంటుందంటా’.. ఇంట్రెస్టింగ్‌గా కుమారి శ్రీమతి ఫస్ట్ లుక్

ఇప్పటికే బ్రీత్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. తన పాత్రకు స్కోప్‌ ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా మీనన్‌.. తాజాగా మరో ఓటీటీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న 'కుమారి శ్రీమతి' వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. చిత్ర యూనిట్ తాజాగా...

Nithya Menen: పెళ్లి గిళ్లీ వద్దంట ఇలాగే ఉంటుందంటా.. ఇంట్రెస్టింగ్‌గా కుమారి శ్రీమతి ఫస్ట్ లుక్
Kumari Srimathi

Updated on: Sep 16, 2023 | 4:18 PM

నిత్యమీనన్‌.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అలా మొదలైందిన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసింది. ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్‌ ఇలా ప్రతీ సినిమాలో తన నటనతో మెస్మరైజ్‌ చేసింది. గ్లామర్‌ పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూనే కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది నిత్యా.

ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీల్లోనూ తళుక్కుమంటోంది. ఇప్పటికే బ్రీత్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. తన పాత్రకు స్కోప్‌ ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా మీనన్‌.. తాజాగా మరో ఓటీటీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. చిత్ర యూనిట్ తాజాగా శనివారం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ వీడయోను విడుదల చేసింది. ఇందులో నిత్యా పాత్రపై మేకర్స్‌ ఓ క్లారిటీ ఇచ్చారు.

కుమారి శ్రీమతి ఫస్ట్ లుక్‌..

వాయిస్‌ ఓవర్‌తో కూడిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ వీడియో వెబ్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచేసింది. ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ మొత్తం నిత్యామీనన్‌ పాత్ర చుట్టే తిరుగుతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీజర్‌లో వచ్చే.. ‘అబ్దుల్ కలాం అంట… రజనీకాంత్ అంట… తర్వాత ఈవిడే నంట… ఉద్యోగం సద్యోగం చేయదంట… బిజినెస్సే చేస్తాదంట… కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోదట’ అని వచ్చే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ను ప్రతిబింబించేలా ఈ వెబ్‌ సిరీస్‌ ఉండనున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌ను ఎర్లీ మూన్‌ సూన్ టేల్స్‌ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. వైజయంతి మూవీస్‌ ఈ కొత్త బ్యానర్‌ను లాంచ్‌ చేయడం విశేషం. గోమటేష్‌ ఉపాధ్యా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌కు అవసరాల శ్రీనివాస్‌ రచయితగా వ్యవహరించాడు. మరి ఫస్ట్‌ లుక్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల తర్వాత ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..