Prabhas: ప్రభాస్‌తో అలాంటి సినిమా చేస్తా.. మెగా డాటర్ క్రేజీ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas: ప్రభాస్‌తో అలాంటి సినిమా చేస్తా.. మెగా డాటర్ క్రేజీ కామెంట్స్..
Prabhas

Updated on: May 18, 2025 | 8:17 AM

ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తే లాభాలు గ్యారెంటీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంటాయి. దాంతో ఆయనతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అంతేకాదు ప్రభాస్ కు రూ. 200కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న డార్లింగ్ ఇప్పుడు అరడజను కు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అలాగే హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా చేస్తున్నాడు రెబల్ స్టార్.

ఇదిలా ఉంటే ప్రభాస్‌తో కామెడీ సినిమా చేస్తానంటుంది మెగా డాటర్ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేదు ఈ చిన్నది. దాంతో నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసి సక్సెస్ అందుకుంది. కాగా తాజాగా అవార్డు వేడుకలో ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్స్ తో ఎలాంటి సినిమాలు చేయాలనీ భావిస్తున్నారు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం తెలిపింది. నిహారిక మాట్లాడుతూ.. ప్రభాస్ తో కామెడీ సినిమా చేస్తా అని తెలిపింది. అలాగే మహేష్ బాబుతో భారీ పౌరాణిక సినిమా చేస్తా అని తెలిపింది. ఇక అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ చేస్తా అని.. ఒకవేళ దర్శకత్వం చేసే అవకాశం వస్తే తన తొలి సినిమా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తోనే ఉంటుందని చెప్పుకొచ్చింది నిహారిక. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.