Niharika Konidela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దగ్గర్నుంచి వైష్ణవ్ తేజ్ దాకా సుమారు అరడజనకుపైగా హీరోలు టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఈక్రమంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) భర్త జొన్నలగడ్డ చైతన్య (Chaitanya Jonnalagadda) కూడా సినిమాల్లోకి రాబోతున్నడనే ప్రచారం జోరుగా సాగింది. నిహారిక అడుగుజాడల్లోనే చైతన్య నడుస్తాడని, హీరోగా ఎంట్రీ ఇస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తోడు హీరోకు తగ్గ క్వాలిటీస్ చైతన్యలో ఉన్నాయని త్వరలోనే తన డెబ్యూమూవీని ప్రకటిస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. ఈక్రమంలో చైతన్య సినిమా ఎంట్రీపై అతని సన్నిహితులు ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చైతన్యకు నటన అంటే పెద్దగా ఆసక్తి లేదని, సినిమాలు చేయడని, తన వ్యాపారాన్నే చూసుకుంటాడని స్పష్టతనిచ్చారు. కాగా నిహారికతో వివాహం అనంతరం చైతన్య సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురయ్యాయట. వాటికి విసిగిపోయిన అతను తనకు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ లేదని, ప్రస్తుతం తాను చేస్తోన్న బిజినెస్ పట్ల సంతృప్తిగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారని సమాచారం.
కాగా నిహారిక-చైతన్యలు 2020 డిసెంబర్ 9న పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఆపై హీరోయిన్‌గానూ మెప్పించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలతో పాటు సైరా వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. అదేవిధంగా నిర్మాతగా కొన్ని వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించింది. గతేడాది నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..