Nidhhi Agerwal: కిరీక్కిస్తోన్న సోయగాల నిధి.. అందాలతో చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ

|

Jun 19, 2023 | 8:30 AM

బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగ్ చైతన్య హీరో నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో పద్దతిగా కనిపించి మెప్పించింది.

Nidhhi Agerwal: కిరీక్కిస్తోన్న సోయగాల నిధి.. అందాలతో చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ
Nidhi Agarwal
Follow us on

చాలా మంది హీరోయిన్ వరుస విజయాలతో అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం హిట్స్ అందుకోకపోయినా తమ గ్లామర్ తో అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అలంటి ముద్దుగుమ్మల్లో నిధి అగర్వాల్ ఒకరు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగ్ చైతన్య హీరో నటించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో పద్దతిగా కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మరోసారి అక్కినేని హీరోతో కలిసి సినిమా చేసింది. ఈ సారి అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత డైనమి డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.

రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన అందాలతో రెచ్చిపోయింది ఈ వయ్యారి భామ. గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారును ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత యదామములే మళ్లీ ఈ అమ్మడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మొదలు పెట్టాయి. ఈ మధ్య హిట్ సినిమాలు రావాలని పూజలు కూడా చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీర మల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరో వైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది ఈ భామ. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. తాజాగా నిధి షేర్ చేసిన ఫొటోలుకుర్రాళ్ళను చూపు తిప్పుకోనివ్వడం లేదు.