Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌ సూపర్బ్ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవుతారంతే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో ఈ సాంగ్ ను లాంఛ్ చేయగా, ఇదే పాటకు నిధి అగర్వాల్ అద్బుతంగా డ్యాన్స్ చేసింది.

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌ సూపర్బ్ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవుతారంతే
Hari Hara Veera Mallu

Updated on: May 28, 2025 | 7:28 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ . క్రిష్ జాగర్ల మూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా యాక్ట్ చేసింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. పాన్ ఇండియా మూవీ కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రమోషన ఈవెంట్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం (మే 28) ‘తార తార’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో సందడి చేసింది. ఇదే సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ తార తార సాంగ్ కు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. నిధి అగర్వాల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చాలా బాగుందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా తార తార సాంగ్ కు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. శ్రీ హర్ష సాహిత్యం సమకూర్చారు. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ కలిసి ఈ పాట పాడారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాలో విలన్ గా యానిమల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నాడు. వీరితో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. చాలా రోజుల తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా కావడంతో వీర మల్లు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

హరి హర వీరమల్లు ఈవెంట్ లో నిధి అగర్వాల్..

నిధి అగర్వాల్ డ్యాన్స్ వీడియో..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.