Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కారు. గురువారం (ఫిబ్రవరి 27) వీరి వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే?
Vijay Rashmika Marriage

Updated on: Feb 27, 2026 | 6:45 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం (ఫిబ్రవరి 27) ఉదయపూర్ లోని ఓ ప్రముఖ ప్యాలెస్ వేదికగా ఏడడుగులు నడిచారీ జంట. రెండు సంప్రదాయాల ప్రకారం, విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరిగింది. గురువారం ఉదయం 10 గంట‌ల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత కొడగు సంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారీ జంట. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక లే స్వయంగా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న వెంటనే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఇద్దరూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సివిల్ డ్రెస్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు విజయ్, రష్మిక. తమ వెడ్డింగ్ కు రిసెప్షన్ వేడుకకు రావాలని అమిత్ షాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అమిత్ షాకు కానుకగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో నిర్వహించనున్నారు. మార్చి 4వ తేదీన ఓ లగ్జరీ హోటల్ లో గ్రాండ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్- రష్మికల పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నూతన దంపతులు విజయ్ దేవరకొండ- రష్మిక..

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫొటోస్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us