Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ‘వరుడు కావలెను’నుంచి మరో సాంగ్..

అవసరాల శ్రీనివాస్ రూపొందించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా పరిచయమైన నాగశౌర్య ఆ తర్వాత  వెంకీ కుడుములు దర్శకత్వంలో

Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. వరుడు కావలెనునుంచి మరో సాంగ్..
ritu varma

Updated on: Aug 04, 2021 | 2:52 PM

Varudu Kaavalenu Movie: అవసరాల శ్రీనివాస్ రూపొందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా పరిచయమైన నాగశౌర్య ఆ తర్వాత  వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన ‘ఛలో’ సినిమాతో మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ కుర్ర హీరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘లక్ష్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్‌‌‌‌‌లో రానుంది. అలాగే లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య  దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే సినిమా చేస్తున్నాడు. ‘వరుడు కావలెను’ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌‌‌‌గా తెరకెక్కుతోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంది. ఇప్పటికే వరుడు కావలెను మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సిద్ శ్రీరామ్ పాడిన  కోలకళ్ళే ఇలా అనే పాట ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘దిగు దిగు నాగ’ అనే లిరికల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తమన్ సంగీత సారథ్యంలో సాగిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘దిగు దిగు దిగు నాగ.. నాగో న్నా దివ్యా సుందర నాగో నాగా..’ అంటూ సాగిన ఈ ఫోక్ సాంగ్‌‌‌‌ను శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంది అందాల రీత్యువర్మ. ఇదిలా ఉంటే గతంలో విడుదల చేసిన ‘కోలకళ్ళే’ అనే పాటకు విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ అందించగా.. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ కు తమన్ సంగీతం అందించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ క్యూట్ చిన్నారికి సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. తలుపు తడుతున్న వరుస ఆఫర్లు..

Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..

Mirabai Chanu: ఒలంపిక్స్‏లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us