పొన్నియన్ సెల్వన్ ఇచ్చిన మైలేజో.. లేక కొత్త హీరోయిన్ల కొరతో తెలియదు కాని.. తిరిగి సూపర్ డూపర్ ఛాన్సులతో కోలీవుడ్‌లో తెగ బిజీ అవుతున్నారు త్రిష. టాలీవుడ్ మేకర్స్‌ను కూడా తన వైపు చూసేలా చేసుకుంటున్నారు. దాంతోపాటే.. రీసెంట్ గా ఓ రెండు మూడు వారల నుంచి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు కూడా..
ఎస్ ! ఓర్ మాక్స్ ఇచ్చిన టాప్ 10 హీరోయిన్ హీరోయిన్ల లిస్టులో ప్లేస్ సంపాదించిన త్రిష.. ఆ న్యూస్‌తో నెట్టింట వైరల్ అవడం మొదలెట్టారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్‌తో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నారు.
అయితే తాజాగా ఈన్యూస్‌పై స్పందించారు త్రిష. తాను తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. అదో ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీతో కూడా నెట్టింట బజ్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే.. ఈ బ్యూటీ కామెంట్స్ పై కెమెంట్స్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. తాను క్లారిటీ ఇచ్చినా సరే! రాజకీయాల్లోకి వెళ్లడం లేదని చెబుతున్నా సరే.. రాజకీయాల్లో నీకంత సీనను లేదమ్మా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్రిష సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2లో నటిస్తోంది. అలాగే రాంగి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది త్రిష.