డైరెక్టర్ పరశురామ్ (Parashuram).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించబోతుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ కళావతి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.
కళావతి పాటకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ సమయంలోనే ఈ పాట యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ పాటకు 12 మిలియన్స్ వ్యూస్ రాగ.. 681 కే లైక్స్ వచ్చాయి. వందో.. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ మైమరపిస్తుంది. ఇందులో మహేష్ మరింత స్టైలీష్‌గా కనిపించడం… మరోసారి సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో మ్యాజిక్ చేయడం… థమన్ మ్యూజిక్ అన్ని కలిపి కళావతి సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ప్రేమికుల రోజుకు ఒక్కరోజు ముందే మహేష్ బాబు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది సర్కారు వారి పాట టీం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.
Records tumbling in a Classic way ❤️#KalaavathiMusicVideo Trending #1 on YouTube with 12M+ Views ?
– https://t.co/fVmmhK2hAC#SarkaruVaariPaata#SVPOnMay12
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram #AnanthaSriram @saregamasouth pic.twitter.com/i6OjLZS0HT
— Mythri Movie Makers (@MythriOfficial) February 14, 2022
Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..