“ఏ, ఎస్, ఆర్” : దీపికా చెప్పిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు, ఇవిగో హింట్స్ !

|

Oct 02, 2020 | 11:22 AM

ముంబై డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ఫిష్‌ ఎవరో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కనిపెట్టింది. దాంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

ఏ, ఎస్, ఆర్ : దీపికా చెప్పిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు, ఇవిగో హింట్స్ !
Follow us on

ముంబై డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ఫిష్‌ ఎవరో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కనిపెట్టింది. దాంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించేందుకు ఎన్.సి.బి అడుగులు వేస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, దీపిక పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్స్ విచారణకు ఎదుర్కొంటుండగా.. హీరోలు కూడా క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది.

ఎన్.సి.బి అధికారుల విచారణలో విచార‌ణ‌లో దీపికా ముగ్గురు కోస్టార్ల పేర్లను కోడ్ చేస్తూ..”ఏ, ఎస్, ఆర్” అనే నేమ్స్‌ను తెలిపినట్టు ప్రచారం జోరందుకుంది. బీటౌన్‌లో ఈ వార్తలు హాట్‌టాపిక్‌గా మారడమే కాదు.. పెద్ద దుమారమే రేపాయి. దీపికా ప‌దుకునే చెప్పిన ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు జారీచేసేందుకు ఎన్.సి.బి అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆ ముగ్గురూ గ‌తంలో దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన‌వారేన‌ని మ‌రో హింట్ కూడా తెర‌పై చర్చకు వ‌చ్చింది. దీంతో ఆ హీరోలెవ‌ర‌నే దానిపై అంద‌రిలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

తాజాగా కోడ్‌లో ఉన్న పేర్లలో ‘ఎస్’ అనే ప‌దం ఇపుడు లైమ్ లైట్‌లోకి వచ్చింది. ‘ఎస్’ అంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖానే అంటూ టాక్ న‌డుస్తోంది. ‘ఏ’ అంటే అర్జున్ రాంపాల్ అన్న పేరు వినిపిస్తోంది. ఎన్.సి.బి అధికారులు వీరిద్దరికీ స‌మ‌న్లు జారీచేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీపికాతో క‌లిసి ‘ఓం శాంతి ఓం’, ‘దిల్ వాలే’ చిత్రాల్లో న‌టించారు అర్జున్ రాంపాల్‌, షారుక్ ఖాన్‌. ఈ రెండు పేర్లు అలా ఉంచితే..మ‌రి ‘ఆర్’ అనే కోడ్ ఎవ‌రిదై ఉంటుంద‌న్న చర్చ కూడా జోరందుకుంది. మొత్తానికి దీపికా చెప్పిన ఏ, ఎస్‌, ఆర్ లు ఎవ‌ర‌నే దానిపై ఎన్.సి.బి అధికారుల నుంచి క్లారిటీ వ‌స్తే కానీ తెలియ‌దు.

బాలీవుడ్‌లో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి కనుసన్నల్లోనే మత్తు వ్యవహారం మొత్తం జరుగుతోందన్న ప్రచారం ఉంది. అందులో కరణ్ జోహార్ సహా మరో ఏడుగురు కీలక వ్యక్తుల పేర్లు ఎన్.సి.బి లిస్టులో ఉన్నాయన్న ప్రచారం సాగుతున్న క్రమంలో వారిని కూడా పిలిచే అవకాశాలు లేకపోలేదన్న చర్చ నడుస్తోంది.

డ్రగ్స్‌ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎవర్ని విచారిస్తే ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సుశాంత్‌ కేసు నుంచి రియా చక్రవర్తి అరెస్టు.. తర్వాత మిగతా నటుల విచారణ వరకు అంతా ఓ హైప్‌ను క్రియేట్‌ చేస్తూ సాగుతోంది. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కామన్‌ అన్న విధంగా బయటపడుతున్న విషయాలు అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అందానికి డ్రగ్స్‌ తీసుకోవడమే కారణమన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ డ్రగ్స్‌ కేసులో కీలకం ఎవరు.. అసలు కారకులు ఎవరు అన్నది బయటపడాల్సి ఉంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ఈ కేసు.. రాను రాను ఇంకెంత మందిని బోనులో నిలబెడుతుందోనన్న ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది.

Also Read :  హథ్రాస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు