Nayanthara: ‘అన్నపూర్ణి’ టీజర్ రిలీజ్.. సరికొత్తగా రాబోతున్న నయనతార..

షారుక్‌తో నయనతార నటించిన ‘జవాన్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళంలో అనేక పాత్రలలో అలరించిన లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సరికొత్త పాత్రలో మెప్పించేందుకు సిద్ధమయ్యింది. తన కొత్త సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నయనతార 75వ సినిమా టీజర్ విడుదలైంది . ఈ సినిమా పేరు ‘అన్నపూర్ణి’గా ఫిక్స్ చేశారు మేకర్స్.

Nayanthara: అన్నపూర్ణి టీజర్ రిలీజ్.. సరికొత్తగా రాబోతున్న నయనతార..
Nayanthara

Updated on: Oct 25, 2023 | 8:16 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఈ ఏడాది నయన్ పెద్ద విజయాన్ని అందుకుంది. షారుక్‌తో నయనతార నటించిన ‘జవాన్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళంలో అనేక పాత్రలలో అలరించిన లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సరికొత్త పాత్రలో మెప్పించేందుకు సిద్ధమయ్యింది. తన కొత్త సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నయనతార 75వ సినిమా టీజర్ విడుదలైంది . ఈ సినిమా పేరు ‘అన్నపూర్ణి’గా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టైటిల్, టీజర్ రిలీజ్ చేసారు. తాజాగా విడుదలైన వీడియోలో నయన్ సంప్రదాయ బ్రహ్మణ అమ్మాయిగా కనిపిస్తుంది.

‘అన్నపూర్ణి’లో నయనతార సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. ఇల్లు ఎలా ఉంటుందో టీజర్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మ, నాన్న, నాన్నమ్మతో కలిసి ఉండే అమ్మాయి.. పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంమటుంది. కానీ ఆమెకు నాన్ వెజ్ అంటే ఇష్టం కలుగుతుంది. ఇంట్లోవాళ్లు పూజలలో ఉండగా.. ఆమె మాత్రం పుస్తకాల్లోని నాన్ వెజ్ లెగ్ పీసులను చూస్తూ నోట్లో లాలాజనం ఊరినట్లుగా చూపిస్తారు. అయితే అసలు విషయం ఏంటీ అనేది తెలియరాలేదు. ఇందులో నయన.. లంగావోణిలో ఎంతో సంప్రదాయమైన లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ మాత్రం కథపై క్యూరియాసిటీ కలిగిస్తోంది.

కొద్ది రోజులుగా నయన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ‘అన్నపూర్ణి’ సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ కథే ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నయనతారతో పాటు అచ్యుత్ కుమార్, సత్యరాజ్, కార్తీక్ కుమార్, సురేష్ చక్రవర్తి, కె.ఎస్. రవికుమార్, రేణుక తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ ఎస్. ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూసిన అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.