లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త విష్నేష్ శివన్ దంపతులు మంచి మనసు చాటుకున్నారు. వర్షంలో నిరాశ్రయులైన పేదలకు ఆహారం, ఇతర వస్తువులు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే. జీవనోపాధి లేక, ఉండటానికి సరైన ఇళ్లు లేక రోడ్లపైనే జీవించే నిరాశ్రయులైన నిరుపేదలకు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి శుక్రవారం (ఏప్రిల్ 7) రాత్రి వర్షంలోనే నిరాశ్రయులకు భోజనం పొట్లాలు అందించారు. నయన్ దంపతుల గొప్ప మనసును నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. నయన్ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి నెలలో ఆమె పలువురు పేదలకు గిఫ్ట్ బాక్సులు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘చెన్నై నగర వీధుల్లో నిద్రిస్తోన్న నిరాశ్రయులైన పేదలకు లేడీ సూపర్ స్టార్ చేసిన సాయం ఆమె గొప్ప మనసును చాటుతోంది’, ‘నయన్ అందచందాల్లోనేకాదు మనసు కూడా ఎంతో ఉన్నతమైనది’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధికమంది నెటిజన్లు ‘తలైవి’ అంటూ నయన్‌ను పిలవడం విశేషం.
It was really kind of Lady Superstar #Nayanthara and @VigneshShivN to assist homeless persons on the streets who were suffering from the rain. #inspiringcouple pic.twitter.com/4sMsE8gbUS
— Chennai Memes (@MemesChennai) April 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.