Nani 30: జెట్ స్పీడ్ లో నాని 30 షూటింగ్.. ముంబైకి పయనమైన టీమ్

|

May 22, 2023 | 9:43 AM

నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింమ్ప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా థీమ్ ను వివరించారు. తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ ఇది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Nani 30: జెట్ స్పీడ్ లో నాని 30 షూటింగ్.. ముంబైకి పయనమైన టీమ్
Nani 30
Follow us on

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింమ్ప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా థీమ్ ను వివరించారు. తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ ఇది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో కియారా ఖన్నా నాని కూతురిగా నటిస్తోంది.  ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరగనుంది. త్వరలోనే మూవీ టీమ్ ముంబై చేరుకోనున్నారు. ఇది మేజర్ షెడ్యూల్ అని యూనిట్ వర్గాల సమాచారం. వారం రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇందులో నాని-మృణాల్ ఠాకూర్ సహా కీలక నటులంతా భాగమవుతారని తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నాని ఫ్యాన్స్.