
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో.. మరోసారి వీరి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి మరింత భారీ స్థాయిలో, పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ‘ది ప్యారడైజ్’ను రూపొందిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో మూవీపై హైప్‌ను మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో హీరో నాని చేసిన ఓ ఆసక్తికర కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నానిని సినిమా టైటిల్‌కు సంబంధించి ప్రశ్నించగా.. ఒకవేళ ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ కాకుండా మరో పేరు పెట్టాల్సి వస్తే ‘సమ్మక్క’ అనే టైటిల్ తన దృష్టిలో ఈ కథకు వంద శాతం సరిపోతుందని అన్నారు నాని. నాని నోటి నుంచి వచ్చిన ఈ పేరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అసలు భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాకు ‘సమ్మక్క’ అనే టైటిల్ ఎందుకు అంతగా సరిపోతుంది.? ఈ పేరుకు కథతో ఉన్న సంబంధం ఏమిటి.? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాలో నాని తల్లి పాత్ర పేరు సమ్మక్క అని తెలుస్తోంది. అంతేకాదు, కథలో ఈ పాత్రకు చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరో పాత్ర ప్రయాణానికి ఈ మదర్ క్యారెక్టర్ బలమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌గా నిలుస్తుందని సమాచారం. అందుకే కేవలం యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో మాత్రమే కాకుండా.. తల్లి, కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బంధం కూడా కథలో ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని ‘సమ్మక్క’ అనే పేరు కథకు పూర్తిగా సరిపోతుందని చెప్పారా.? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. కాగా భారీ అంచనాల మధ్య ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.