Hero Nani: నేచురల్ స్టార్ నాని తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దసరా షూటింగ్ జరుగుతున్నా సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి నాని బయటపడ్డాడు. దసరా బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది.. ఈ సినిమా షూటింగ్ ని చిత్ర బృందం శరవేగంగా జరుపుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన తెలంగాణ బొగ్గు గని.. విలేజ్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సమయంలో నాని బొగ్గు గని లారీ కింద షూటింగ్ చేస్తున్నాడు. అయితే అనుకోని విధంగా లారీలోని బొగ్గు మొత్తం నాని మీద పడింది. దీంతో చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, నానికి అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి గాయాల బారిన పడలేదు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
నాని క్షేమంగా వచ్చిన తర్వాత, నాని కొన్ని నిమిషాల విరామం తీసుకున్నాడు. చిత్ర బృందం కాసేపు షూటింగ్ ఆపివేశారు. అనంతరం నాని తయారైన తర్వాత తిరిగి యధావిధిగా షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ జతకట్టింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని ఫిజిక్‌ని సరిచేయడానికి దాదాపు 7 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అష్టాచమ్మ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు. డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా అంటే సుందరానికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.