
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న సినిమా ‘యానిమల్’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నాన్న నువ్ నా ప్రాణం’ అంటూ సాగే ఈ పాట ఎంతో ఎమోషనల్ గా ఉంది. ఈ పాటలో రణబీర్ కపూర్, అతని తండ్రి అనిల్ కపూర్ మధ్య ఉండే బంధాన్ని అడియన్స్ మనసుకు హత్తుకునేలా చూపించారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య రిలేషన్ షిప్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు భాషల్లోనూ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాటలో వింటే అడియన్స్ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. ఈ ఎమోషనల్ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించగా.. సోను నిగమ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, ద్వేషంతో కూడిన భావోద్వేగం ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు విడుదలైన సాంగ్ చూస్తుంటే.. కచ్చితంగా ఈ పాట రణబీర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా తెలుస్తోంది. యానిమల్ సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు రణబీర్. అలాగే ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో నార్త్ అడియన్స్ ను అలరించిన రష్మిక ఆశలన్ని ఇప్పుడు యానిమల్ చిత్రంపైనే ఉన్నాయి.
#PapaMeriJaan #NannaNuvNaaPranam #NeeEnUlagam #NeeyanakhilamThaathaa #NannaRaviNeene song from #Animal ❤️🔥https://t.co/atEZnLYsiahttps://t.co/1nCTZ3HTWj
Telugu 👆🏼https://t.co/2Ye5Xj3heW
Tamil 👆🏼https://t.co/PC6BkbHnio
Kannada 👆🏼https://t.co/FSV2GNATrZ
Malayalam 👆🏼— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 14, 2023
ఇక హిందీలో సందీప్ చేస్తోన్న రెండవ సినిమా ఇదే కావడం విశేషం. 2017లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్ గా కబీర్ సింగ్ సినిమాను రూపొందించారు సందీప్ రెడ్డి. 2019లో విడుదలైన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు సందీప్.
#PapaMeriJaan #NannaNuvNaaPranam #NeeEnUlagam #NeeyanakhilamThaathaa #NannaRaviNeene song tmrw
@harshavardhan_rameshwar @sonunigamoff
#RanbirKapoor @rashmika_mandanna @iambobbydeol @tripti_dimri
#BhushanKumar @pranayreddyvanga @tseriesfilms #BhadrakaliPictures pic.twitter.com/ANsWTnDAxu— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.