
ప్రస్తుతం థియేటర్లలో హానుమాన్ సినిమా హవా కొనసాగుతుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ దూసుకుపోతుంది. మరికొన్ని రోజుల్లోనే ఊరు పేరు భైరవకోన, ఈగిల్, లాల్ సలామ్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఇటు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. దీంతో అటు ఓటీటీల్లోనూ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్, మాస్ యాక్షన్ చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?.. అదే రారా పెనిమిటీ.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నందితా శ్వేతా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన విభిన్న డ్రామా రారా పెనిమిటి. ఈ చిత్రానికి సత్య వెంకట్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. టీజర్, పోస్టర్స్, ట్రైలర్ తో విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన ఈ మూవీ.. థియేటర్లలోనూ పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇక ఆ తర్వాత ఓటీటీలో విడుదల మాత్రం చాలా ఆలస్యంగా జరిగింది.
చాలాసార్లు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుటు ఎట్టకేలకు విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ‘హంగామా ప్లే’, ‘గ్యాలక్సీ ఓటీటీ’ అనే రెండు ఓటీటీల్లో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అటు అమెజాన్ ఓటీటీలోనూ ఈ మువీ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ మన దేశంలో స్ట్రీమింగ్ కావడం లేదు.
Telugu film #RaaRaaPenimiti (2023) by #SatyaVenkat, ft. @Nanditasweta, now streaming on @Hungama_Play & #GalaxyOTT.#ManiSharma @tipsmusicsouth pic.twitter.com/bxNWvmQWtJ
— CinemaRare (@CinemaRareIN) January 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.