Nagarjuna’s Wild Dog: ‘వైల్డ్ డాగ్’ థియేటర్లలోనే.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాగ్‌.. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ నేపథ్యంలో

|

Mar 02, 2021 | 4:50 PM

లాంగ్ గ్యాప్‌ తర్వాత అక్కినేని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది కూడా ఓ రియల్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో..

Nagarjuna’s Wild Dog: వైల్డ్ డాగ్ థియేటర్లలోనే.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాగ్‌.. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ నేపథ్యంలో
Follow us on

Nagarjuna’s Wild Dog : లాంగ్ గ్యాప్‌ తర్వాత అక్కినేని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది కూడా ఓ రియల్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో.. పవర్ ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. బాంబ్‌ బ్లాస్ట్ నేపథ్యంలో `వైల్డ్‌డాగ్‌` సినిమా తెరకెక్కింది. త్వరలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేస్తోంది.

 అక్కినేని నాగార్జున సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్క్రీన్‌పైకి రాబోతున్నారు. వైల్డ్ డాగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగ్‌. మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అహిషార్‌ సోలమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాగ్‌ కనిపిస్తుండగా.. ఆయనతో పాటు బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్, అలీ రజా, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ చేద్దామనుకున్న వైల్డ్‌ డాగ్‌ మూవీ అతి త్వరలో థియేటర్లలో విడదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు ‘వైల్డ్ డాగ్’ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోనే విడుదల చేయాలనుకున్న  హీరో నాగార్జున…ఏప్రిల్ 2న థియేటర్లో విడుదల కాబోతుందని తెలిపారు. గతేడాది నవంబర్‌లోనే సినిమాను పూర్తి చేశామని..ఆ టైంలో థియేటర్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఓటీటీలో విడుదల చేశామన్నారు. ఇక మీదట ఓటీటీ ఫ్లాట్‌ ఫాంలో ఉన్న సినిమాను మర్చిపోవాలని…వైల్డ్ డాగ్ ఓటీటీ సినిమా కాదని చెప్పారు. వైల్డ్‌డాగ్‌ మూవీ షూట్‌ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్న నాగ్‌.. హైదరాబాద్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌ బెస్ చేసుకొని సినిమా తెరకెక్కిందన్నారు. బాంబ్‌ బ్లాస్ట్‌ నిందితులను పట్టుకోవంపై సినిమా ఉంటుందని వెల్లడించారు. ఈ కాన్సెప్ట్‌ ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుందన్నారు.

కొత్త వాళ్ళను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే నాగార్జున..ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేశారని నిర్మాత నిరంజన్‌ రెడ్డి అన్నారు. నాగ్‌ చేసిన ఎన్నో ప్రయోగాల్లో ఈ చిత్రం ఒకటని చెప్పుకొచ్చారు. కొవిడ్ వల్ల సినిమా ఆలస్యం అయ్యిందదని డైరెక్టర్ సోలమన్ తెలిపారు. మేజర్‌ పార్ట్ షూటింగ్‌ కొత్తకొత్త లొకేషన్స్‌లో చేశామని అన్నారు. ఈ మూవీ రైట్స్‌ కోసం నిర్మాతలకు అక్షరాల 27 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాయి ఓటీటీ సంస్థలు.

Also Read:

కీచక టీచర్.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. వికృత ఆనందం..

 ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు…