Nagarjuna : నాగార్జున అందానికి కారణం ఇదేనా.. నిద్రపోయే ముందు ఆ పని చేయాల్సిందేనట

విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు నాగ్. ఈ మధ్యకాలంలో నాగ్ సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగ్. ఆతర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున బిగ్ బాస్ కు హోస్ట్ గ చేస్తూ బిజీగా ఉన్నారు. గత నాలుగు సీజన్స్ నుంచి నాగార్జున బిగ్ బాస్ గేమ్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సీజన్ సెవన్ మొదలు కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

Nagarjuna : నాగార్జున అందానికి కారణం ఇదేనా.. నిద్రపోయే ముందు ఆ పని చేయాల్సిందేనట
Nagarjuna

Updated on: Aug 23, 2023 | 4:01 PM

టాలీవుడ్‌లో సీనియర్ హీరోలంతా కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున స్టైల్ ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు నాగ్. ఈ మధ్యకాలంలో నాగ్ సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగ్. ఆతర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున బిగ్ బాస్ కు హోస్ట్ గ చేస్తూ బిజీగా ఉన్నారు. గత నాలుగు సీజన్స్ నుంచి నాగార్జున బిగ్ బాస్ గేమ్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సీజన్ సెవన్ మొదలు కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నప్పటికీ నాగార్జున వారికి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాగే అందంలోనూ ఫిట్ నెస్ లోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అందానికి రహస్యం ఏంటో చెప్పారు నాగ్.

నాగార్జున ప్రతి రోజు నిదరబోయే ముందు ఐస్ క్రీమ్ తిని పాడుకుంటారట. ఐస్ క్రీమ్ తినకపోతే తనకు నిద్ర పట్టదు అని తెలిపారు నాగార్జున. తాను తీసుకునే ఫుడ్ కారణంగానే తాను ఫిట్ గా ఉంటానని తెలిపారు. ఫుడ్ కారణంగానే తన బాడీ ఎప్పుడు ఒకే విధంగా ట్యూన్ అవుతూ ఉంటుందని తెలిపారు నాగార్జున.

నేను ఫుడ్ విషయంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకొను అని తెలిపారు. అలాగే నేను కావాలంటే బరువు పెరుగుతా.. కావాలంటే బరువు తగ్గుతా కూడా అని తెలిపారు నాగార్జున.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.